![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -913 లో... గుడిలో అన్నదానం చేస్తానని పంతులికి ధాన్యలక్ష్మి డబ్బులు ఇస్తుంటే.. నువ్వు అన్నదానం చేయడం అత్తగారిగా నాకు ఇష్టం లేదని ఇందిరాదేవి అంటుంది. చేసేది మంచి పని అయినప్పుడు అందరికి నచ్చాల్సిన అవసరం లేదని ధాన్యలక్ష్మి అంటుంది. అయితే నీ కోడలు చేసింది తప్పని నీకెలా అనిపిస్తుంది, తను ఒక తల్లి బిడ్డని కాపాడిందని ఇందిరాదేవి అంటుంది.
దాంతో నేను చేసేది మీకు నచ్చలేదని అంటున్నారు కాబట్టి చెయ్యను అది కోడలుగా మీకు నేను ఇస్తున్న గౌరవం అని ధాన్యలక్ష్మి అంటుంది. పంతులు గారు ఇక నుండి అన్నదానం చెయ్యనని ధాన్యలక్ష్మి చెప్పి పంతులిని పంపిస్తుంది.
ఆ తర్వాత పంతులు గారు పిన్ని కోరుకున్నట్లు అన్నదానం జరిపించండి.. డబ్బులు నేను పంపిస్తానని పంతులికి చెప్పి పంపిస్తాడు రాజ్. కాసేపటికి అదేంట్రా ప్లాన్ ఇలా ఫెయిల్ అయిందని రాజ్ తో ఇందిరాదేవి అంటుంది. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఉందని రాజ్ అంటాడు.
మరొకవైపు రాహుల్ కంపెనీకి వచ్చిన క్లయింట్స్ అందరు కావ్య డిజైన్స్ నచ్చి వెళ్లిపోతున్నారని రాహుల్ కి మేనేజర్ ఫోన్ చేసి చెప్తాడు. దాంతో రాహుల్ కోపంగా ఉంటాడు. అప్పుడే రుద్రాణి వచ్చి రాజ్ బిజీగా ఉన్నాడు కాబట్టి అప్పుడు అలా సక్సెస్ అయ్యావ్.. ఇప్పుడు అలాగే చేసి మళ్ళీ నీ రూట్ క్లియర్ చేసుకోమని రుద్రాణి చెప్తుంది.
ఆ తర్వాత పాపని తీసుకొని ఇంటికి వస్తుంది రేణుక. అప్పు మేడమ్ వల్లే నా కూతురు నా దగ్గరికి వచ్చింది.. అలాంటి అప్పు మేడమ్ మీకు కోడలిగా వచ్చిందంటే మీ అదృష్టం అని ధాన్యలక్ష్మితో అప్పు గురించి రేణుక గొప్పగా చెప్తుంది. అక్క నీలాగే నేను పోలీస్ అవుతానని పాప చెప్తుంటే.. ధాన్యలక్ష్మి ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత ఏంటి ధాన్యం, అప్పు విషయంలో నిర్ణయం మార్చుకోలేకపోతున్నావా అని తనని మార్చాలని ప్రకాష్ ట్రై చేస్తాడు.
ఆ తర్వాత క్లయింట్స్ అందరు మన కంపెనీకీ వచ్చారని రాజ్ కి శృతి ఫోన్ చేసి చెప్తుంది. రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. నేను ఒకసారి వాళ్లతో మాట్లాడాలి, మళ్ళీ ఇంకొకసారి వేరొక కంపెనీకి పోరని గ్యారెంటీ లేదని కావ్య అనగానే.. బిజినెస్ లో నన్ను మించి పోయావని కావ్య గురించి రాజ్ గొప్పగా చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |